సమస్యల పరిష్కారానికి పీజీఆర్‌ఎస్‌ మంచి వేదిక | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి పీజీఆర్‌ఎస్‌ మంచి వేదిక

Apr 7 2026 9:25 AM | Updated on Apr 7 2026 9:25 AM

పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్‌ఎస్‌ మంచి వేదికని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. ప్రభాకరరెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ కె. హేమలత, ఎస్‌డీసీ కల్యాణ్‌చక్రవర్తితో కలసి 113 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ఎక్కువ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను గుర్తించి వాటిపై సమగ్ర పరిశీలన చేసి పరిష్కరించాలని సూచించారు.

వినతుల్లో కొన్ని..

● రహదారి సౌకర్యం లేక రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని కురుపాం మండలం నాయుడుగూడ గ్రామానికి చెందిన వి. మన్మధరావు, తదితరులు వినతిపత్రం అందజేశారు.

● శ్మశానవాటికలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించిన సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పార్వతీపురం మండలం పెదబొండపల్లి పంచాయతీ గదబవలస గ్రామానికి చెందిన పలువురు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

● సైనికుల కోటా కింద అలమండ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 177లో ఉన్న బంజరభూమిని ఇప్పించాలని కోరుతూ జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామానికి చెందిన జి. మన్మధరావు వినతిపత్రాన్ని అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement