యువకుడి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

యువకుడి అదృశ్యం

Apr 7 2026 9:25 AM | Updated on Apr 7 2026 9:25 AM

విజయనగరం క్రైమ్‌: కొద్ది రోజులుగా తమ కుమారుడు నారంశెట్టి గణపతి (16) కనిపించడం లేదని తండ్రి వెంకటరమణ సోమవారం స్థానిక రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. విజయనగరం పాలిటెక్నికల్‌ కాలేజీలో ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న గణపతి 20 రోజుల నుంచి కాలేజీకి వెళ్లడం లేదు. ఇదే విషయమై కొడుకును తండ్రి వెంకటరమణ మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన గణపతి ఈ నెల 2వ తేదీన కళాశాలకు వెళ్తున్నానని చెప్పి వెళ్లి ఇంతవరకు ఇంటికి చేరుకోలేదు. బంధువుల ఇళ్లల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా... ఎస్సై అశోక్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మహిళ అదృశ్యం..

విజయనగరం క్రైమ్‌: గుర్ల మండలం జమ్ముపేటకు చెందిన రమణమ్మ (54) కనిపించడం లేదని అతని కుమారుడు రవికుమార్‌ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశాడు. ఆభరణాల కొనుగోలు నిమి త్తం ఈ నెల ఒకటో తేదీన విజయనగరం గంటస్తంభం ప్రాంతానికి వెళ్తున్నానని చెప్పి ఇంతవరకు ఇంటికి చేరుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సమీప ప్రాంతాల్లో, బంధువుల ఇళ్లల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో బాధిత మహిళ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై రవికుమార్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement