బొబ్బిలి: పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న దాడితల్లి అమ్మవారికి శుక్రవారం సహస్రఘటాభిషేకం నిర్వహించారు. అర్చకులు పిండిప్రో లు మణికుమార్ శర్మ ఆధ్వర్యంలో వేదపండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
స్టీల్ ప్లాంట్ భూముల పరిశీలన
గుర్ల: మండలంలోని కెల్ల, వల్లాపురం, మన్యపురిపేట గ్రామాల్లో ఏర్పాటుకానున్న స్టీల్ ప్లాంట్ భూములను రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి యువరాజు, జేసీ సేతుమాధవన్, ఆర్డీఓ సుధారాణి శుక్రవారం పరిశీలించారు. స్టీల్ ప్లాంట్‌కు ప్రభుత్వం ఇటీవల 1085 ఎకరాలు కేటాయించిన సంగతి తేలిసిందే. భూముల వివరాలను పూర్తి స్థాయిలో అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. భూములను పరిశీలించిన వారిలో తహసీల్దార్ ఆదిలక్ష్మి, సర్వేయర్ శివ ఉన్నారు.


