లక్కవరపుకోట: ప్రేక్షకుల కేరింతల మధ్య రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలు మండలంలోని భీమాళి గ్రామంలో సోమవారం ఉత్కంఠభరితంగా సాగాయి. ఈ పోటీలను ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ప్రస్తుత ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు కేవీ ప్రభావతితో కలిసి ప్రారంభించారు. గ్రామదేవత పరదేశమ్మ పండగను పురస్కరించుకుని కమిటీ సభ్యులు ఈ పోటీలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన క్రీడాకారులుపాల్గొన్నారు. విజేతలకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా ఆర్గనేజింగ్ కార్యదర్శి ఎన్.లక్ష్మణరావు, రిఫరీలు మురళి, రామారావు, రవి, తిరుపతిరావు, ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు, సర్పంచ్, ఉప సర్పంచ్‌లు కొయ్యాన కృష్ణ, గణేష్, వైస్ ఎంపీపీ ఎం.శ్రీనురాజు, మాజీ సర్పంచ్ గుల్లిపల్లి రామునాయుడు, తదితరులు పాల్గొన్నారు.


