రాములోరి హుండీల ఆదాయం రూ.18.08 లక్షలు | - | Sakshi
Sakshi News home page

రాములోరి హుండీల ఆదాయం రూ.18.08 లక్షలు

Mar 31 2026 7:14 AM | Updated on Mar 31 2026 7:14 AM

హెల్మెట్‌ ధారణతో ప్రాణ రక్షణ

నెల్లిమర్ల రూరల్‌: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలోని హుండీల ఆదాయాన్ని దేవదాయశాఖ అధికారులు సోమవారం లెక్కించారు. మొత్తం 41 రోజులకు రూ.18,08,722 ఆదాయం లభించినట్లు దేవస్థానం ఈఓ వై.శ్రీనివాసరావు తెలిపారు. కొట్టాం గ్రూప్‌ దేవాలయం ఈఓ జి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగిన లెక్కింపు కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన శ్రీవారి సేవా భక్తులు, దేవస్థానం సిబ్బంది, బ్యాంక్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

సబ్‌జైల్‌ తనిఖీ

విజయనగరం క్రైమ్‌: రాష్ట్ర హోం మంత్రి అనిత విజయనగరం కంటోన్మెంట్‌లో ఉన్న సబ్‌జైల్‌ను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులో రికార్డులను పరిశీలించారు. ఖైదీలతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న భోజన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల పనితీరుపై ఆరా తీశారు. అనంతరం విజయనగరం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ను పరిశీలించారు. అక్కడ చెత్తకుండీలు ఉండడంపై స్టేషన్‌ సిబ్బందిని మందలించారు. ఆమె వెంట ఎమ్మెల్యే అదితి, ఎస్పీ దామోదర్‌ ఉన్నారు.

విశాఖపట్నం రేంజి ఐజీ గోపీనాథ్‌ జట్టి

పార్వతీపురం రూరల్‌: ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్‌ ధరించి ప్రాణాపాయం నుంచి తమను తాము రక్షించుకోవాలని విశాఖపట్నం రేంజి ఐజీ గోపీనాథ్‌ జట్టి పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ‘హెల్మెట్‌ అవగాహన ర్యాలీ’ని సోమ వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ... రహదారి ప్రమాదాల్లో మరణి స్తున్న వారిలో 50 శాతం మంది హెల్మెట్‌ ధరించని కారణంగానే ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హెల్మెట్‌ ధరించడం భారంగా కాకుండా, బాధ్యతగా భావించాలని కోరారు. ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌ రెడ్డి పర్యవేక్షణ లో పట్టణంలోని చర్చి కూడలి నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్‌, నాలుగురోడ్ల కూడలి మీదుగా పాతబస్టాండ్‌ వరకు సాగింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు ఐజీ హెల్మెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ఏఎస్పీ మనీషారెడ్డి, పాలకొండ డీఎస్పీ రాంబాబు, ఏఆర్‌ డీఎస్పీ థామస్‌ రెడ్డి, స్థానిక సీఐ లు, ఎస్సైలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement