ఈ చిత్రాలు చూశారా... కొత్తవలస మండలం చింతలపాలెం ప్రజలకు సేవలందించే సచివాలయం ఇది. సాయంత్రమైతే చాలు సచివాలయం పోర్టుకో మందుబాబులకు అడ్డాగా మారుతోంది. ఊరిలోని బెల్టుషాపుల వద్ద కొనుగోలుచేసిన మద్యం, తాటికల్లును ఇక్కడ తాగుతూ సచివాలయం ఆవరణను బార్‌గా మార్చేస్తున్నారు. ఖాళీ సీసాలు, తినుబండారాల కవర్లను అక్కడే ఇష్టారాజ్యంగా పడేస్తున్నారు. దీంతో వివిధ సేవలకోసం వచ్చే గ్రామస్తులతో పాటు సచివాలయ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. పల్లెల్లో విచ్చలవిడిగా సాగుతున్న మద్యం అమ్మకాలకు అడ్డుకట్టవేయాలని, సచివాలయాల వద్ద మద్యం తాగడాన్ని అడ్డుకోవాలని అధికారులకు విజ్ఞప్తిచేస్తున్నారు. – కొత్తవలస


