రేగిడి: మండల పరిధిలోని సంకిలి వద్ద ఉన్న ఈఐడీ ప్యారీ ఇండియా లిమిటెడ్ చక్కెర కర్మాగారంలో ఈ నెల 28న చెరకు క్రషింగ్ ముగియనున్నదని యాజమాన్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది 2.25 లక్షల మెట్రిక్ టన్నులు చెరకు గానుగ ఆడడం జరిగిందని యాజమాన్యం వెల్లడించింది. 2025–26 సంవత్సరానికి సంబంధించి చెరకు క్రషింగ్ సీజన్ ముగియనున్న దృష్ట్యా రైతులు త్వరపడి చెరకును కటింగ్ చేసి కర్మాగారానికి తరలించాలని కోరింది. పొలాల్లో ఉన్న మిగులు చెరకు మొత్తాన్ని సరఫరా చేస్తే క్రషింగ్ చేయడం జరుగుతుందని వెల్లడించింది. అందుకు అవసరమైన కటింగ్ ఆర్డర్లను సంబంధిత సిబ్బందికి చెప్పినట్టు పేర్కొంది. క్రషింగ్‌ను సమయానికి పూర్తి చేయడంలో సహకరించిన రైతులు, సిబ్బంది, వాహన డ్రైవర్లకు కృతజ్ఞతలు తెలిపింది.


