విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని యువకుడి దుర్మరణం

Mar 27 2026 9:50 AM | Updated on Mar 27 2026 9:50 AM

మక్కువ: విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని ఓ యువకుడు మృతి చెరందిన ఘటన మక్కువ – దుగ్గేరు రహదారి మధ్యలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని పనసభద్ర పంచాయతీ దిగువమెండంగి గ్రామానికి చెందిన సీదరపు శంభు(20) గురువారం పని నిమిత్తం మండల కేంద్రానికి వచ్చాడు. పనుల ముగించుకుని మక్కువ నుంచి ద్విచక్ర వాహనంపై తన స్వగ్రామానికి తిరుగు పయనమయ్యాడు. కొండ బుచ్చింపేట గ్రామ సమీపంలో వాహనం అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని మక్కువ పీహెచ్‌సీకి తరలించారు. తీవ్రంగా గాయపడిన శంభుకు వైద్యులు ప్రథమ చికిత్స అందించినా.. అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement