విశ్వగురు స్థానంలో భారత్‌ .. | - | Sakshi
Sakshi News home page

విశ్వగురు స్థానంలో భారత్‌ ..

Mar 23 2026 7:04 AM | Updated on Mar 23 2026 7:04 AM

బాడంగి: భారతదేశాన్ని 2047 నాటికి విశ్వగురు స్థానంలో నిలపడమే తమ ధ్యేయమని.. అందుకోసం అహర్నిశలు శ్రమిస్తామని ఆర్‌ఎస్‌ఎస్‌ కండ కార్యవాహక కార్యదర్శి ఎం.గణపతి అన్నారు. తొలుత స్థానిక మెయిన్‌రోడ్డుపై పద సంచలనం పేరుతో భారతమాత జెండాలు పట్టుకుని ఆదివారం ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక స్వామి కల్యాణ మంటపంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్‌ను రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ దేశం, ధర్మం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు బేతనపల్లి శంకరరావు, అంబటి గణపతి, లగుడు పరశునాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement