గ్యాస్ సిలిండర్ పేలి పూరిల్లు దగ్ధం
● రూ.4 లక్షల ఆస్తి నష్టం
బొండపల్లి: మండలంలోని రాచకిండాం గ్రామంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి పూరిల్లు దగ్ధమైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించి గజపతినగరం అగ్ని మాపక అధికారి ఎంఎస్‌వి.రవి ప్రసాద్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పాలవలస నూకాలుకు చెందిన ఇంట్లో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలడంతో పూరిల్లు కాలిపోయింది. ప్రమాదంలో ఇంట్లో ఉంచిన రెండున్నర లక్షల రుపాయలు నగదుతో పాటు, లక్షన్నర విలువ చేసే బంగారు ఆభరణాలు పూర్తిగా కాలి బూడిదైనట్టు చెప్పారు. తమకు సమాచారం అందిన వెంటనే అగ్ని మాపక వాహనంతో వెళ్లి మంటలను అదుపు చేసి మిగతా ఇళ్లకు మంటలు వ్యాపించకుండా మంటలను అదుపు చేసినట్టు తెలిపారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు. పెళ్లి కోసం దాచిన డబ్బులు, బంగారం కాలి బూడిదయ్యాయని రోదిస్తున్నారు.
గ్యాస్ సిలిండర్ పేలి పూరిల్లు దగ్ధం


