పాచిపెంట: మండలంలోని పెద కంచూరు గ్రామ సమీపంలో అల్యూమినియం యూనిట్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ యువరాజ్, జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్‌కుమార్ రెడ్డితో కలిసి శుక్రవారం స్థల పరిశీలన చేపట్టారు. రెవెన్యూ సర్వేయర్, అటవీశాఖ అధికారులతో మాట్లాడి భూమికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అప్రోచ్ రోడ్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై గల అవకాశాలపై ఆరా తీశారు. వీరి వెంట పరిశ్రమల అధికారి సీతారామ్, పాచిపెంట మండల తహసీల్దార్ రవి, పరిశ్రమల ప్రోత్సాహక అధికారి బ్రహ్మాజీ, ఏపీఐఐసీ అధికారులు, సర్వేయర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


