రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు

Feb 25 2026 10:38 AM | Updated on Feb 25 2026 10:38 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు

రామభద్రపురం: రామభద్రపురం నుంచి తారాపురం వెళ్లే జాతీయ రహదారిపై మంగళవారం ద్విచక్ర వాహనం ఓ వ్యక్తిని ఢీకొని ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం బోల్తాపడిన ఘటనలో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. తారాపురం గ్రామానికి చెందిన బి.శ్రీనివాసరావు తారాపురం నుంచి రామభద్రపురం నడుచుకుంటూ వస్తున్నాడు. సరిగ్గా తారాపురం ఆలయం వద్దకు వచ్చేసరికి వెనుకగా పాచిపెంట నుంచి రామభద్రపురం ముగ్గురు వ్యక్తులతో వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టి ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం కూడా బోల్తా పడింది. దాంతో నడుచుకుంటూ వస్తున్న శ్రీనివాసరావుతో పాటు రామభద్రపురం పండగకు ద్విచక్ర వాహనంపై వస్తున్న కె.మోహనరావు, వి.నాగరాజు, వి.వెంకన్నలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ వి.ప్రసాదరావు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రధమ చికిత్స నిమిత్తం క్షతగాత్రులను 108లో సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు1
1/3

రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు2
2/3

రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు3
3/3

రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement