విజయీభవ..!
జిల్లా వ్యాప్తంగా సోమవారం ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్షకు విద్యార్థులకు తోడుగా పరీక్ష కేంద్రాలకు తల్లిదండ్రులు వచ్చారు. ముందుగా ఇష్టదైవాలకు పూజలు చేశారు. పిల్లలను విజయీభవ అంటూ తల్లిదండ్రులు ఆశీర్వదించారు. పలు పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి తనిఖీ చేశారు. కేఎల్‌పురంలోని శ్రీలక్ష్మీగణపతి జూనియర్ కళాశాలలో పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. ఏర్పాట్లపై ఆరా తీశారు. తొలిరోజు నిర్వహించిన
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర తెలుగు, సంస్కృతం, ఉర్దూ పరీక్షలకు జనరల్ విభాగంలో 17,997 మందికి 17,490 మంది హాజరుకాగా 507 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 2,433 మందికి 2,078 మంది హాజరుకాగా 355 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 20,430 మంది విద్యార్థులకు గాను 19,568 మంది హాజరు
కాగా 862 మంది గైర్హాజరైనట్టు ఆర్‌ఐఓ ఎస్.తవిటినాయుడు తెలిపారు.
– విజయనగరం అర్బన్/సాక్షిఫొటోగ్రాఫర్,
విజయనగరం
తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకుంటున్న విద్యార్థి
విజయీభవ..!


