● విశ్రాంత వయస్సులో.. చదువులమ్మ చెట్టు నీడలో..! | - | Sakshi
Sakshi News home page

● విశ్రాంత వయస్సులో.. చదువులమ్మ చెట్టు నీడలో..!

Feb 24 2026 9:04 AM | Updated on Feb 24 2026 9:04 AM

● విశ్రాంత వయస్సులో.. చదువులమ్మ చెట్టు నీడలో..!

● విశ్రాంత వయస్సులో.. చదువులమ్మ చెట్టు నీడలో..!

చీపురుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో వారంతా 1964 నుంచి 1969 వరకు పాఠశాల విద్యను అభ్యసించారు. వివిధ ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ విశ్రాంత వయస్సుకు చేరారు. వీరంతా చదువుకున్న పాఠశాల నీడలో సోమవారం సరదాగా గడిపారు. ఒకరినొకరు గుర్తుచేసుకుంటూ, యోగక్షేమాలు తెలుసుకుంటూ నాటి మధురస్మృతులను నెమరవేసుకున్నారు. వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు పి.ఆనందసాగర్‌, బి.ఉమామహేశ్వరరావు, ధనుకొండ ఉమామహేశ్వరిను సత్కరించారు. కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ కన్వీనర్‌, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఎంవీఎస్‌ఎన్‌.రాజు, యు.రాంబాబు, ఎస్‌.చిట్టికృష్ణారావు, పి.మోహనరావు, కింతలి ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

– చీపురుపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement