గంజాయి వినియోగం అనర్థదాయకం
గంజాయి వినియోగం వల్ల యువత విపరీత పోకడలకు పాల్పడతారు. రన్‌ఎమాక్ అనే రుగ్మత వల్ల ఇది సంభవిస్తుంది. డెలీడెడ్రమామ్స్, పొకై న్‌బగ్స్ వల్ల ఒంటిపై ఏవో పాకుతున్నట్టు వివిధ రకాల మానసిక సమస్యలు తలెత్తి వారి భవిష్యత్తుకు అవరోధాలు ఏర్పడతాయి. పిల్లల నడతపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి.
– డాక్టర్ రామ్‌నరేష్, ఎంఎస్, బొబ్బిలి
ముమ్మాటికీ పాలకుల వైఫల్యమే!
యువతకు ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ, ఉపాధి బాటలు వేయడంలో పాలకులు విఫలమవుతున్నారు. ఏవో హామీలు గుప్పించేయడం, ఆ తరువాత వదిలేయడం చేస్తున్నారు. దీనివల్ల యువత చెడుమార్గాన పయనిస్తున్నారు. పాలకుల మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప ఆచరణ శుద్ధి కనిపించడంలేదు. విద్యార్థుల భవిష్యత్తుపై మాటలు కాకుండా అచరణ చూపాలి.
– బి రవికుమార్,
ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్
నిరుద్యోగం దారులు చూపిస్తోంది
యువతకు నిరుద్యోగం, కోరికలు ఎక్కువవుతున్నాయి. వ్యవస్థలో లోపాలు సరిదిద్దాల్సిన పాలకులు నిర్లక్ష్యంగా ఉన్నారు. యువతకు పనిలేదు. ఆర్ధిక వ్యవస్థ పాడయింది. గంజాయితో పాటు దోపిడీలను అలవాటు చేసుకునే పరిస్థితులు న్నాయి. 90 రోజులు బెయిలబుల్ ఇవ్వని కేసుల్లో విశాఖ జైలులో ఉన్న సామర్థ్యాన్ని మించి ఖైదీలుంటే.. అందులో గంజాయి బ్యాచ్ అత్యధికంగా ఉన్నారు. గంజాయి జోలికి వెళ్లకుండా ఉండాలంటే యువతకు మంచి మార్గం చూపాలి.
– పొట్నూరు శంకరరావు,
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు
గంజాయి వినియోగం అనర్థదాయకం
గంజాయి వినియోగం అనర్థదాయకం


