28 నుంచి రాష్ట్ర స్థాయి మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ | - | Sakshi
Sakshi News home page

28 నుంచి రాష్ట్ర స్థాయి మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌

Feb 24 2026 9:04 AM | Updated on Feb 24 2026 9:04 AM

28 నుంచి రాష్ట్ర స్థాయి మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ చాంపియ

28 నుంచి రాష్ట్ర స్థాయి మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ చాంపియ

విజయనగరం: ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 4 వరకు జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ కొండపల్లి అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక డీఎస్‌ఏ ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పోటీలకు సంబంధించిన ఆహ్వానపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు దశల్లో నిర్వహించే పోటీల్లో మొదటి దశలో 35 నుంచి 55 సంవత్సరాలు పైబడిన వయస్సు గల సీ్త్ర, పురుషులకు పోటీలు నిర్వహించనుండగా.... 3, 4వ తేదీల్లో 60 నుంచి 80 సంవత్సరాలు పైబడిన సీ్త్ర, పురుషులకు పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సింగిల్స్‌, డబుల్స్‌, మిక్సిడ్‌ డబుల్స్‌ విభాగాల్లో నిర్వహించే పోటీలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు హాజరవుతారని తెలిపారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను మార్చి 18 నుంచి 25వ తేదీ వరకు గోవాలో జరగనున్న జాతీయ స్థాయి మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపిక చేయటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి నున్న సురేష్‌, ఆర్గనైజింగ్‌ కమిటీ ప్రతినిధులు వై.కుసుంబచ్చన్‌, ఎంకేబీ శ్రీను, ఇమంది అనిల్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement