గుంకలాంలో కార్డన్‌ సెర్చ్‌ | - | Sakshi
Sakshi News home page

గుంకలాంలో కార్డన్‌ సెర్చ్‌

Feb 24 2026 9:04 AM | Updated on Feb 24 2026 9:04 AM

గుంకలాంలో కార్డన్‌ సెర్చ్‌

గుంకలాంలో కార్డన్‌ సెర్చ్‌

పది ద్విచక్ర వాహనాలు స్వాధీనం

అదుపులో ఎనిమిది మంది

అనుమానితులు

విజయనగరం క్రైమ్‌: విజయనగరం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి గుంకలాం లే అవుట్‌లో డీఎస్పీ గోవిందరావు ఆధ్వర్యంలో సుమారు 60 మంది సిబ్బంది సోమవారం కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుంటూ అనుమానితులపై దృష్టి సారించారు. అనంతరం గ్రామస్తులతో డీఎస్పీ సమావేశమై అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని పది ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేయడంతో పాటు ఎనిమిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమంలో రూరల్‌ సీఐ లక్ష్మణరావు, ఎస్సైలు అశోక్‌, సాయికృష, సిబ్బంది మూర్తి, సునీత, దుర్గాప్రసాద్‌, లక్ష్మణరావు, వెంకట్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement