ఓపీ సేవలే దిక్కు | - | Sakshi
Sakshi News home page

ఓపీ సేవలే దిక్కు

Feb 24 2026 9:04 AM | Updated on Feb 24 2026 9:04 AM

ఓపీ స

ఓపీ సేవలే దిక్కు

కార్మికులకు..

నిర్మాణాలు జరుగుతున్నాయి..

ఈఎస్‌ఐ వంద పడకల ఆస్పత్రి నిర్మాణం రెండేళ్లుగా జరుగుతున్నాయి. పూర్తవడానికి ఇంకా కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఇంజినీరింగ్‌ అధికారులు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు.

– జీవన్‌, కార్మిక రాజ్య బీమా సంస్థ, మేనేజర్‌

విజయనగరం ఫోర్ట్‌: ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ పరిధిలోని కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు విశాఖపట్నం ఈఎస్‌ఐ ఆస్పత్రికి రిఫరల్స్‌ తగ్గించాలనే ఉద్దేశంతో జిల్లాకు మంజూరు చేసిన ఈఎస్‌ఐ ఆస్పత్రికి మోక్షం ఎప్పుడు కలుగుతుందోనని కార్మికులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో ఈఎస్‌ఐ ఆస్పత్రి లేకపోవడంతో కార్మికులకు కేవలం ఓపీ సేవలే అందుతున్నాయి. దీంతో ఇన్‌పేషెంట్‌గా చేరాలన్నా.. మెరుగైన వైద్యసేవలు పొందాలన్నా విశాఖపట్నంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రికి పరుగులు తీయాల్సిందే. మా కష్టాలు ఎప్పుడు తీరుతాయోనని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని.. అన్న సామెత మాదిరిగా ఆస్పత్రి మంజూరైనా నిర్మాణ పనులు నత్తనడకన సాగడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈఎస్‌ఐ ఆస్పత్రి ఎప్పటికి

పూర్తయ్యేనో..?

నత్తనడకన నిర్మాణం

ప్రస్తుతం డయాగ్నోస్టిక్‌ సెంటర్‌పైనే ఆధారం

అత్యవసరమైతే విశాఖపట్నం పరుగులు తీయాల్సిందే

జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల మంది వరకు కార్మికులు

ఓపీ సేవలే దిక్కు1
1/1

ఓపీ సేవలే దిక్కు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement