సకాలంలో స్పందించాలి | - | Sakshi
Sakshi News home page

సకాలంలో స్పందించాలి

Feb 24 2026 9:04 AM | Updated on Feb 24 2026 9:04 AM

సకాలంలో స్పందించాలి

సకాలంలో స్పందించాలి

బ్రాయిలర్‌ లైవ్‌ డ్రెస్‌డ్‌ స్కిన్‌లెస్‌ శ్రీ132 శ్రీ234 శ్రీ244

పార్వతీపురం రూరల్‌: బాధితులను పదే పదే పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పవద్దని.. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి చట్టపరిధిలో విచారణ చేపట్టాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కుటుంబ కలహాలు, భూ వివాదాలు, సైబర్‌ మోసాలు, వేధింపులు వంటి అంశాలపై తొమ్మిది ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ సీఐ ఆదాం, ఎస్సై రమేష్‌ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement