సెంచూరియన్‌లో ‘గజజ్యోతి’ ఉత్సవాలు
నెల్లిమర్ల రూరల్: మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ‘గజజ్యోతి’ ఉత్సవాలు ఆదివారం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ డీఎన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన వినూత్న ప్రాజెక్ట్‌లను ఆయన పరిశీలించి ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఉన్న సజనాత్మకతను వెలికితీయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖ సినీ గాయకుడు యశస్వి కొండేపూడి ఆలపించిన మధుర గీతాలు అలరించాయి. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ చాన్సలర్ ప్రొఫెసర్ జీఎస్‌ఎన్ రాజు, వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ప్రశాంత్‌కుమార్ మహంతి, రిజిస్ట్రార్ డాక్టర్ పల్లవి, పలువురు ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


