సంగమేశ్వరుని జాతర ఆదాయం రూ. 6.31 లక్షలు | - | Sakshi
Sakshi News home page

సంగమేశ్వరుని జాతర ఆదాయం రూ. 6.31 లక్షలు

Feb 22 2026 6:57 AM | Updated on Feb 22 2026 6:57 AM

సంగమే

సంగమేశ్వరుని జాతర ఆదాయం రూ. 6.31 లక్షలు

వంగర: మండలంలోని సంగాం గ్రామంలోని పవిత్ర సంగమేశ్వర ఆలయ జాతర ఆదాయం శనివారం లెక్కించారు. వారం రోజులపాటు నిర్వహించిన జాతరలో రూ. 6,31,541లు ఆదాయం సమకూరిందని ఈఓ పి.శ్యామలరావు తెలపారు. ప్రత్యేక దర్శన టికెట్ల విక్రయంతో రూ.2.82 లక్షలు, ఽశీఘ్రదర్శనానికి సంబంధించి రూ. 2,19,550లు రాగా, హుండీలో భక్తులు వేసిన కానుకల రూపంలో రూ.1,29,991లు సమకూరిందని తెలిపారు. గతేడాది రూ. 6,70,459లు రాగా, ఈ ఏడాది రూ.38 వేలు తక్కువ వచ్చిందన్నారు.

‘జనగణన–2027’పై శిక్షణ

కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి

విజయనగరం కలెక్టరేట్‌: భారత జనగణన (సెన్సస్‌)– 2027 నిర్వహణకు సంబంధించి మొదటి దశపై జిల్లా, మండల స్థాయి అధికారులకు, సాంకేతిక సిబ్బందికి ఈ నెల 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి తెలిపారు. తన చాంబర్‌లో అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది మే నుంచి చేపట్టనున్న మొదటిదశ జనగణన వివరాల నమోదు(హెచ్‌ ఎల్‌ఓ)పై సిబ్బందికి ఎంవీజీఆర్‌ కాలేజీలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇళ్ల జాబితాలో ప్రతి బ్లాకులో 800 మంది జనాభాలోపు ఉండేలా మ్యాపింగ్‌ చేయాలన్నారు. ఎనిమిది వందలకు మించి జనాభా ఉన్న రెవెన్యూ గ్రామాలను, విడదీసి రెండవ బ్లాకులు ఏర్పాటు చేయా లని తెలిపారు. లే అవుట్‌ మ్యాపింగ్‌లో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకో వాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఇ.మురళి, సీపీఓ పి.బాలాజీ, దేవ్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

పుణ్యగిరి ఆదాయం రూ.15.30లక్షలు

శృంగవరపుకోట: శివరాత్రిని పురస్కరించుకుని పుణ్యగిరి క్షేత్రంలో రెండు రోజులపాటు జరిగిన జాతరలో మొత్తం రూ.15,30,890ల ఆదా యం సమకూరినట్టు దేవస్థానం ఈఓ కె.నాగేంద్ర శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. టికెట్ల వల్ల రూ.5,32,400లు, ప్రసాదాల విక్రయాల వల్ల రూ.1,67,400లు, కానుకల వల్ల రూ. 34,004లు, కేశఖండన వల్ల రూ.12,000లు, హుండీల నుంచి రూ.7,85,080లు వెరసి రూ.15,30,890లు ఆదాయం వచ్చిందన్నారు.

సంగమేశ్వరుని జాతర ఆదాయం రూ. 6.31 లక్షలు 1
1/1

సంగమేశ్వరుని జాతర ఆదాయం రూ. 6.31 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement