గిరిజన ప్రాంతాల్లో పెరటికోళ్ల పెంపకం
● ఐటీడీఏ పీఓ సి. యశ్వంత్‌కుమార్ రెడ్డి
పార్వతీపురం రూరల్: గిరిజన ప్రాంతాల్లోని పేద కుటుంబాలు ఆర్థికాభివృద్ధి చెందేలా పెరటికోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించనున్నట్లు ఐటీడీఏ పీఓ, జేసీ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి అన్నారు. హెఫర్ ఇంటర్నేషనల్ సహకారంతో దేశవాళీ పెరటి కోళ్ల పెంపకం ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. శనివారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో పశు సంవర్థక, హెఫర్ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందుగా సాలూరు, పాచిపెంట మండలాల్లో పైలెట్ ప్రాతిపదికన ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. గిరిజన మహిళా సంఘాలకు యూనిట్లు పంపిణీ చేయడంతో పాటు.. కోళ్ల పెంపకంలో ఆధునిక మెలకువలు, మార్కెటింగ్‌పై శిక్షణ ఇస్తామన్నారు. తక్కువ పెట్టుబడితో ఆదాయం లభించే ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో ఏపీఓ మురళీధర్, జిల్లా పశుసంవర్థక శాఖాధికారి ఎస్.మన్మధరావు, ప్రాజెక్ట్ మేనేజర్లు పాల్గొన్నారు.
గిరిజన ప్రాంతాల్లో పెరటికోళ్ల పెంపకం


