సీతంలో ముగిసిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ
విజయనగరం అర్బన్: గాజులరేగలోని సీతం ఇంజినీరింగ్ కళాశాలలో ‘వీఎల్‌ఎస్‌ఐ – ఎలక్ట్రానిక్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పాత్ర’ అనే అంశంపై వారం రోజులుగా నిర్వహించిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా వీఎల్‌ఎస్‌ఐ బేసిక్స్, చిప్ డిజైన్ దశలు, అలాగే ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృత ఉపయోగాలు వంటి కీలక అంశాలపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమాన్ని ఏపీ స్కిల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ సహకారంతో నిర్వహించారు. ఏపీఎస్‌డీసీ అధికారి ఎం.శివనాగరాజు, ఎ.జయగోపీనాథ్‌ద్, ఎస్.ప్రవీణ్ శిక్షకులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ టీడీవీ నాయుడు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


