సమానత్వం సమగ్రాభివృద్ధికి పునాది
● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
కార్యదర్శి కృష్ణప్రసాద్
విజయనగరం ఫోర్ట్: సమానత్వం సమగ్రాభివృద్ధికి పునాది అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఎ.కృష్ణప్రసాద్ అన్నారు. స్థానిక డైట్ కళాశాలలో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్బంగా నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉన్న అసమానతలను తొలిగించి ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మనదేశ రాజ్యాంగం ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక రాజకీయ న్యాయం కల్పించాలనే లక్ష్యంతో రుపొందించబడిందన్నారు. న్యాయం దృష్టిలో అందరూ సమానులే అన్నారు. న్యాయానికి పేద, ధనిక అనే తేడా లేదన్నారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించబడతాయన్నారు. న్యాయ సలహాలు పొందడానికి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ట్రోల్ ఫ్రీ నంబరు 15100 ను వినియోగించుకోవాలన్నారు. సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానల్ న్యాయవాది పి.రమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


