పీజీఆర్‌ఎస్‌కు ఆరు అర్జీలు
సీతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు కేవలం ఆరు అర్జీలు మాత్రమే వచ్చాయి. ఏపీఓ జి.చిన్నబాబు వినతులు స్వీకరించారు. పౌల్ట్రీఫారం యూనిట్ లోన్ ఇప్పించాలని కోదుల వీరఘట్టంకు చెందిన బి.నీలకంఠం కోరారు. ఐటీడీఏ పరిధిలో ఎలక్ట్రీషియన్ పోస్టు ఇప్పించాలని గులుమూరుకు చెందిన ఉమామహేష్ వినతి ఇచ్చారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా ఇప్పించాలని సుభలయ కాలనీకి చెందిన దేవుదల అన్నపూర్ణ కోరారు. పెద్దదిమిలికి చెందిన టి.ముఖలింగం భూమి రీ సర్వే చేయించాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


