వెయిట్ లిఫ్టింగ్‌లో సహస్ర ప్రతిభ
నెల్లిమర్ల రూరల్: ఉత్తరప్రదేశ్‌లోని మోదీ నగర్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వవిద్యాలయం బీబీఏ విద్యార్థి వకీల్ సహస్ర కాంస్య పతకం సాధించింది. యూత్ లెవెల్ 77 కిలోల విభాగంలో స్నాచ్‌లో 79 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 102 కిలోలు కలిపి మొత్తం 181 కిలోలు బరువులు ఎత్తి ఈ పతకాన్ని సాధించింది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చినందుకు ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ డి.ఎన్.రావు, చాన్సలర్ ప్రొఫెసర్ జి.ఎస్.ఎన్.రాజు, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ప్రశాంతకుమార్ మహంతి, రిజిస్ట్రార్ పల్లవి, విజేత సహస్ర, కోచ్ అర్జున్‌కు అభినందనలు తెలిపారు.
అగ్ని ప్రమాదంలో కారు దగ్ధం
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఎల్విన్‌పేట పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న భవనంలో పార్క్ చేసి ఉన్న కారు శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా దగ్ధమైంది. కారు చుట్టు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు స్థానిక అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక అధికారి ఎ.సింహాచలం ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ మేరకు అగ్ని ప్రమాదానికి గురైన కారు ఎల్విన్‌పేట గ్రామానికి చెందిన బిడ్డిక వరలక్ష్మీదని, మంటలు మరింతగా వ్యాప్తి చెంది ఉంటే సమీపంలో ఉన్న మరో లగేజ్ ఆటో కూడా అగ్నికి ఆహుతి అయ్యి ఉండేదన్నారు. ప్రమాద కారణాలు తెలియాల్సి ఉందని అగ్ని మాపక అధికారులు పేర్కొన్నారు.
సరిహద్దు గ్రామాల్లో ఎకై ్సజ్ దాడులు
కురుపాం: ఆంధ్రా – ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఎకై ్సజ్ అధికారులు విస్తృతంగా దాడులు చేశారు. 850 లీటర్ల సారా, 16,600 లీటర్ల పులిసిన బెల్లం ఊటను ధ్వంసం చేసినట్టు కురుపాం ఎకై ్సజ్ సీఐ పి.శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట బి.శ్రీనాధుడు ఆదేశాలతో ఆంధ్రా – ఒడిశా సరిహద్దు గ్రామాలైన అనిజ, బోర్, వలవ గ్రామాల్లో ఒడిశా ఎకై ్సజ్ అధికారులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించినట్టు తెలిపారు. దాడుల్లో పార్వతీపురం టాస్క్‌ఫోర్సు ఇన్‌స్పెక్టర్ వీవీఎస్ శేఖర్‌బాబు, పాలకొండ, సాలూరు బోర్డర్ మొబైల్ పార్టీ రాజాం, చీపురుపల్లి ఎకై ్సజ్ స్టేషన్ సిబ్బంది, విజయనగరం ఎన్‌ఫోర్సుమెంటు ఎస్‌ఐ రాజేశ్వరి, కురుపాం, స్టేషన్ ఎస్‌ఐ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నట్టు చెప్పారు.
విజయనగరం అర్బన్: తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి మహిళా ఇన్‌సర్వీస్ టీచర్లకు బీఈడీ దూర విద్య ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా మొదటి రోజు సర్టిఫికెట్ పరిశీలన స్థానిక కరకవలసలోని డాక్టర్ వీపీజీఆర్‌ఎస్ బీఈడీ కళాశాలలో శుక్రవారం జరిగింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం స్టడీ సెంటర్లకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. కౌన్సెలింగ్‌లో మహిళా యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ డి.అరుణ, కో–ఆర్టినేటర్ టి.శిరీష్, డాక్టర్ రవి, డాక్టర్ రేఖా, డాక్టర్ మారుతి కుమారి, డాక్టర్ హైమావతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్‌మోహన్ మాట్లాడుతూ సర్టిఫికెట్ పరిశీలన కార్యక్రమం సజావుగా జరిగిందని తెలిపారు. యూనివర్సిటీ అధికారులు స్థానికంగా పరిశీలన నిర్వహించడంపై మహిళా ఇన్‌సర్వీస్ టీచర్లు హర్షం వ్యక్తం చేశారు.
వెయిట్ లిఫ్టింగ్‌లో సహస్ర ప్రతిభ
వెయిట్ లిఫ్టింగ్‌లో సహస్ర ప్రతిభ
వెయిట్ లిఫ్టింగ్‌లో సహస్ర ప్రతిభ


