రాజాం వాసికి ఏఎఫ్‌ఈ అవార్డు
రాజాం సిటీ: ఇన్ఫోసిస్‌లో టాప్‌పొజిషన్‌లో ఉన్న రాజాంకు చెందిన కొత్తా సత్యనారాయణగుప్తకు ఇన్ఫోసిస్ ప్రకటించిన ప్రతిష్టాత్మకమైన ఏఎఫ్‌ఈ అవార్డు లభించింది. గురువారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేసినట్టు రాజాంలో ఉన్న ఆయన సోదరుడు, రాజాం రెడ్‌క్రాస్ అధ్యక్షుడు కొత్తా సాయిప్రశాంత్‌కుమార్ శుక్రవారం తెలిపారు.
ప్రశ్నిస్తే భయపెడుతున్నారు
శృంగవరపుకోట: మా భూములు మాకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తే పోలీస్ కేసులతో భయపెడుతున్నారని పెదఖండేపల్లి పంచాయతీకి చెందిన జిందాల్ నిర్వాసితులు ఆవేదన వ్యక్తంచేశారు. పెదఖండేపల్లి గ్రామం దగ్గర్లో ఉన్న జిందాల్ భూముల్లో శుక్రవారం టేకు, కొబ్బరి, మామిడి చెట్లను యంత్రాలతో తొలగించడాన్ని తప్పుబట్టారు. 19 ఏళ్ల నుంచి పెంచుకున్న చెట్లను అన్యాయంగా, అక్రమంగా నరికేయడం తగదన్నారు. దోపిడీ కంపెనీకి పోలీసులు కంచెలా కాపలా కాయడం న్యాయమా..? మేము సమకాలీన సమాజంలో ఉన్నామా..? ప్రభుత్వం, పాలన ఉందా అన్న అనుమానం వ్యక్తమవుతోందని రైతులు వాపోయారు. ఇంటికో ఉద్యోగం, షేర్లు, ప్యాకేజీ అమలు చేస్తామని హామీలిచ్చి భూములు తీసుకున్న జిందాల్ యాజమాన్యానికి మద్దతుగా స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ఇస్రో సదస్సుకు పట్టణ యువకుడికి పిలుపు
విజయనగరం అర్బన్: మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్‌లో ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు జరగనున్న ప్రతిష్టాత్మక ఇస్రో ఎన్‌ఎస్‌ఎస్–2026 అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సుకు పట్టణానికి చెందిన యువ ప్రతిభావంతుడు తెలికిచెర్ల శ్రీతోద్భవ్‌కు పిలుపు అందింది. శ్రీతోద్భవ్ పరిశోధనాత్మక వ్యాసం ‘సెర్చ్ ఫర్ ఎక్ట్‌స్రాటెరెస్ట్రియల్ లైఫ్ త్రూ కాస్మిక్ లైఫ్ విసబిలిటీ మెట్రిక్’ అంశంపై ఇస్రో శాస్త్ర వేత్తలు, అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధకుల సమక్షంలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని యూపీఈఎస్‌లో ఖగోళ శాస్త్రంలో డిగ్రీ అభ్యసిస్తున్నారు. తండ్రి అనిల్ జిల్లా పరిషత్ సీనియర్ సహాయకుడిగా, తల్లి సౌమ్య నృత్యదర్శకురాలిగా పనిచేస్తున్నారు. భరతనాట్యంలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకున్న విద్యార్థి అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తల సమక్షంలో తన పరిశోధనను ప్రదర్శించే అరుదైన అవకాశం లభించడం పట్ల తల్లిదండ్రులు హర్హం వ్యక్తంచేస్తున్నారు.
రాజాం వాసికి ఏఎఫ్‌ఈ అవార్డు
రాజాం వాసికి ఏఎఫ్‌ఈ అవార్డు


