నేత్రపర్వంగా పైడితల్లి నేత్రోత్సవం
రాజాం సిటీ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం బొబ్బిలి రోడ్డులోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 100వ జాతరను పురస్కరించుకుని శుక్రవారం నేత్రోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త వాకచర్ల దుర్గాప్రసాద్ ఇంటి వద్ద నుంచి మేళతాళాలు, వివిధ వేషధారణలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి పుసుపు, కుంకుమలను సమర్పించారు. అమ్మ వారి ప్రతిమలను గుడి నుంచి కొండంపేట గ్రామంలో ఉన్న లంకలపల్లి కుటుంబీకుల ఇంటివద్దకు చేర్చారు. అక్కడ నుంచి జాతర చివరి రోజు మంగళవారం ఘటోత్సవంలో భాగంగా అమ్మవారి గుడికి వీటిని తిరిగి చేర్చడంతో జాతర ముగుస్తుంది. నేత్రోత్సవంలో వాకచర్ల, సలాది కుటుంబీకులు, ఈఓ బీవీ మాధవరావు, ఆలయ అర్చకులు వేమకోటి సూర్యనారాయణశర్మ, ఆలయ పర్యవేక్షకులు సలాది తులసీదాస్, వెంపల లక్ష్మణరావు పాల్గొన్నారు.
నేత్రపర్వంగా పైడితల్లి నేత్రోత్సవం


