అటవీ ఫలసాయ హక్కుల వేలం | - | Sakshi
Sakshi News home page

అటవీ ఫలసాయ హక్కుల వేలం

Feb 21 2026 6:47 AM | Updated on Feb 21 2026 6:47 AM

అటవీ ఫలసాయ హక్కుల వేలం

అటవీ ఫలసాయ హక్కుల వేలం

విజయనగరం గంటస్తంభం: జిల్లాలోని కోడూరు, కుమిలి రిజర్వ్‌ అడవులు సహా అటవీశాఖ తోటల ఫలసాయ (లీజు) యూనిట్ల బహిరంగ వేలం విజయవంతంగా సాగిందని జిల్లా అటవీశాఖ అధికారి ఆర్‌.కొండలరావు శుక్రవారం తెలిపారు. మొత్తం 16 లీజు యూనిట్ల బిట్‌ 1 నుంచి 16 వరకు ఉత్పత్తులు, ఫలసాయ సేకరణ హక్కులకు వేలంపాట నిర్వహించామన్నారు. మామిడి, జీడి మామిడి, కొబ్బరి, సపోటా చెట్ల ఫలసాయాలను కూడా వేలంలో చేర్చామని చెప్పారు. పలు యూనిట్లకు గరిష్ట ధరలు నమోదయ్యాయని, శాఖాపరమైన ప్రక్రియలు పూర్తిచేసి, సర్కిల్‌ అధికారుల ఆమోదం పొందిన అనంతరం ఫలసాయ సేకరణకు అనుమతులు జారీ చేస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement