ఎంతో ఆశ పడ్డాం
నెలకు రూ.1500 చొప్పున ఆడ బిడ్డలకు ప్రతినెలా ఇస్తామని ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. టీవీలు, పత్రికల్లో గొప్పగా ప్రచారం చేశారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అయింది. నాకు రూ. 30 వేలు రావాలి. ఒక్క రూపాయి కూడా రాలేదు.
– రేజేటి సంధ్య, ఇద్దనవలస గ్రామం,
మెంటాడ మండలం
రూ. 30 వేలు రావాలి
అధికారంలోకి వస్తే నెలకు రూ.1500 చొప్పన ఏడాదికి రూ.18 వేలు ఇస్తామంటూ చంద్రబాబు గొప్పగా ప్రచారం చేశారు. టీడీపీ అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా ఇంతవరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అధికారంలోకి రాకముందు ఆడబిడ్డ నిధి గురించి గొప్పగా చెప్పారు. ఇప్పడు ఆ ఊసే ఎత్తడం లేదు.
– గొల్లు రమాదేవి, మధుపాడ గ్రామం,
గంట్యాడ మండలం
ఎంతో ఆశ పడ్డాం


