చేపలు పట్టుకునేందుకు బహిరంగ వేలం | - | Sakshi
Sakshi News home page

చేపలు పట్టుకునేందుకు బహిరంగ వేలం

Feb 19 2026 10:04 AM | Updated on Feb 19 2026 10:04 AM

చేపలు

చేపలు పట్టుకునేందుకు బహిరంగ వేలం

విజయనగరం ఫోర్ట్‌: మడ్డువలస రిజర్వాయర్‌లో చేపలు పట్టుకునే హక్కుల కోసం బహిరంగ వేలం నిర్వహించనున్నట్టు మత్య్సశాఖ సహాయ తనిఖీదారు ప్రసాదరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వంగర మండలం కొట్టిశ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈ నెల 26వ తేదీ ఉదయం 11.30 గంటలకు బహిరంగ వేలం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్నవారు రూ.18,21,817లు ధరావత్తు చెల్లించి వేలంలో పాల్గొనవచ్చన్నారు. ఎక్కువ మొత్తం పాడిన వారు వెంటనే సొమ్ము చెల్లించాల్సి ఉంటుందన్నారు.

పుణ్యగిరి హుండీల ఆదాయం రూ.7,85,086లు

శృంగవరపుకోట: ఉత్తరాంధ్రలో విశిష్ట శైవక్షేత్రంగా వాసికెక్కిన పుణ్యగిరి క్షేత్రంలో శివరాత్రి వేడుకల్లో భాగంగా హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను దేవదాయశాఖ అధికారులు బుధవారం లెక్కించారు. మొత్తం రూ.7,85,086లు ఆదాయం సమకూరినట్టు ఈఓ కె.నాగేంద్ర, దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ వై.వి.రమణి తెలిపారు. లెక్కింపు ప్రక్రియలో ఉత్సవ కమిటీ చైర్మన్‌ పెదగాడి రాజు, బోర్డు సభ్యులు, దేవదాయశాఖ సిబ్బంది, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

జాతీయ అథ్లెటిక్స్‌లో రంజిత్‌ సత్తా

గుర్ల: జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో రంజిత్‌ కుమార్‌ సత్తా చాటాడు. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో జరిగిన అథ్లెటిక్స్‌ పోటీలలో ఐదు పతకాలు సాధించినట్లు కోచ్‌ సతీష్‌ కుమార్‌ బుధవారం తెలిపారు. 100 మీటర్లు, 200 మీటర్లు విభాగంలో రెండు బంగారు, 400 మీటర్లు, 400 మీటర్ల ర్యాలీలో రెండు సిల్వర్‌, మిక్స్‌డ్‌ ర్యాలీలో రజతం సాధించాడు. రంజిత్‌ కుమార్‌ తండ్రి యు.ఎస్‌ రాజు విద్యుత్‌ శాఖలో ఉద్యోగ విరమణ చేశారు. తల్లి యు.శ్రీదేవి గుర్ల మండలంలోని గరికివలస హైస్కూల్‌ హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు.

చేపలు పట్టుకునేందుకు బహిరంగ వేలం 1
1/1

చేపలు పట్టుకునేందుకు బహిరంగ వేలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement