కన్నులపండువగా కలశయాత్ర
విజయనగరం పూల్‌బాగ్‌లో నిర్మించిన అయోధ్యబాలక్ రామమందిరం ప్రారంభోత్సవం ఈ నెల 20న జరగనుంది. ఈ సందర్భంగా బాలరాముని విగ్రహాన్ని మూడులాంతర్ల కూడలి నుంచి వేదమంత్రాలు, మహిళల కోలాట ప్రదర్శనలు, భక్తులు భజనలు నడుమ బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో తిరువీధిగా తీసుకెళ్లారు. వందలాదిమంది మహిళల కలశయాత్ర కన్నులపండువగా సాగింది. విద్యలనగరంలో భక్తిభావం ఉప్పొంగింది. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లాయి. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు కుసుమంచి సుబ్బారావు, కమిటీ సభ్యులు ధవళ సర్వేశ్వరరావు, పువ్వాడ శ్రీహరి, తోట సత్యనారాయణ, వాసవీ క్లబ్ అధ్యక్షుడు విజ్జపు విజయకుమార్, డిమ్స్ రాజు, మాచర్ల చంద్రశేఖర్ గుప్తా, కుసుమంచి మహేష్, మాటూరు శ్రీనివాస్, తదితరులు ముందుండి కార్యక్రమాన్ని నడిపించారు. – విజయనగరం టౌన్
కన్నులపండువగా కలశయాత్ర


