పూరిల్లు దగ్ధం..!
డెంకాడ: కల్లాలు వద్ద ఉన్న ఓ పూరి గుడిసె దగ్ధమైన ఘటన డెంకాడ మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు తెలిపిన వివరాలు ప్రకారం.. గంట్లాం పంచాయతీ పరిధి నారాయణరావు కల్లాలు వద్ద కమ్మల ఇంటిలోని రెండు గదుల్లో అన్నాచెల్లెళ్లు మల్లపురాజు బంగారమ్మ, గుడిమెట్ల చిట్టిరాజు నివాసం ఉంటున్నారు. ఈ నెల 16న సాయంత్రం సమయంలో నిప్పు అంటుకుని ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో రూ.30 లక్షలు, 12 తులాల బంగారం అగ్నికి దగ్ధమైంది. దీంతో ఆరుగాలం శ్రమించిన కష్టమంతా బూడిదపాలు అయ్యిందని వాపోయారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా మల్లపు నాగరాజు అనే వ్యక్తి బీడి కాల్చి, అగ్గిపుల్లతో ఇంటికి నిప్పు పెట్టారని ఫిర్యాదులో వెల్లడించారు. కేసు నమోదు చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు తెలిపారు.
బాధిత కుటుంబాలకు సాయం..
జిల్లా ఎస్పీ కమ్యూనిటీ పోలీసింగ్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు పోలీసుల తరఫున సాయం అందించారు. రైస్ ప్యాకెట్, నిత్యావసర సరకులు, కూరగాయలు, దుస్తులను అందజేశారు.
రూ.30 లక్షలు, 12 తులాల
బంగారం బూడిదపాలు
ఉద్దేశపూర్వకంగా చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు
పూరిల్లు దగ్ధం..!


