పూరిల్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

పూరిల్లు దగ్ధం

Jan 17 2026 7:24 AM | Updated on Jan 17 2026 7:24 AM

పూరిల

పూరిల్లు దగ్ధం

తోటపల్లి కుడికాలువలో పడి ఒకరు.. బైక్‌ అదుపుతప్పి యువకుడు..

గుర్ల: మండలంలోని అచ్యుతాపురంలో ముల్లు సూరి రాములుకు చెందిన పూరిల్లు శుక్రవారం కాలిపోయింది. కనుమ పండుగ సందర్భంగా సూరిరాములు కుటుంబసభ్యులు పూజా మందిరం వద్ద దీపం వెలిగించి వెళ్లిపోయారు. కొద్దిసేపటికే పూర్లిలు నుంచి మంటలు రావడంతో స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని స్థానికులు చెబుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి మంటలను అదుపుచేశారు.

చెట్టును ఢీ కొని యవకుడి మృతి

వేపాడ: మండలంలోని నర్సిపల్లిమెట్టకు చెందిన గోపు రామదాసు (27) ద్విచక్రవాహనంపై వస్తూ చెట్టును ఢీ కొని అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం రాత్రి నర్సిపల్లి మెట్ట నుంచి రామదాసు తన అన్నయ్య రామచంద్రవును తీసుకుని ద్విచక్రవాహనంపై బొద్దాం బిర్యానీ కోసం వెళ్లి తిరిగి వస్తుండగా రైల్వే గేట్‌ దాటిన తరువాత కోనేరు మలుపు వద్ద వాహనం అదుపుచేయలేక చెట్టును ఢీకొట్టి రోడ్డుపై పడిపోగా తలకు బలమైనగాయమై అక్కడికక్కడే చనిపోయాడు. ద్విచక్రవాహనం వెనుకన కూర్చున్న రామచంద్రరావుకు బలమైన గాయాలు తగలడంతో విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి గోపు రఘు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల్లంపూడి ఏఎస్సై బి.నాగేశ్వర్రావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

గరుగుబిల్లి: తోటపల్లి కుడికాలువలో ప్రమాదవశాత్తు ఒకరు పడి మృతి చెందారు. దీనిపై శుక్రవారం ఎస్సై ఫకృద్ధీన్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశాలోని రాయగడ జిల్లా గుణుపూర్‌ బ్లాక్‌కు చెందిన హరిక సూర్యం(33) గరుగుబిల్లి మండలంలోని సుంకి పంచాయతీలో నివాసం ఉంటున్న తన చెల్లెలు కుమారిని, కుటుంబసభ్యులను కలిసేందుకు వచ్చాడు. గురువారం సాయంత్రం బహిర్భూమికి కుడికాలువ పరిధికి వచ్చాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతిచెందాడు. కుడికాలువలో పడిన సూర్యం మృతదేహం లభ్యం కావడంతో ఎస్సై కేసు నమోదు చేసి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మక్కువ: మండల కేంద్రానికి చెందిన డోల మధు(19) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మక్కువకు చెందిన మధుతో పాటు కొయ్యాన కార్తీక్‌, గూనాన కార్తీక్‌లు గురువారం రాత్రి ద్విచక్రవాహనంపై ములక్కాయవలస వెళ్లారు. ఈ క్రమంలో వాహనం అదపుతప్పి పడిపోవడంతో మధు తలకు గాయం కాగా మరో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. వారిని మక్కువ పీహెచ్‌సీకి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మధు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్సై ఎం.వెంకటరమణ దర్యాప్తు చేస్తున్నారు.

బైక్‌ ఢీకొని వ్యక్తి..

రాజాం సిటీ: పండగ సరదా తీరకముందే ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రాజాం మండల పరిధి పెనుబాక గ్రామం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన మూకళ్ల రాము (43) మృతిచెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాము బొద్దాం గ్రామానికి వెళ్లి తన పనులు ముగించుకుని స్వగ్రామం నడుచుకుంటూ వస్తున్నాడు. వెనుక నుంచి ద్విచక్రవాహనంపై వస్తున్న కొత్తవలస గ్రామానికి చెందిన గేదెల శేఖర్‌ అదుపు తప్పి రామును ఢీకొన్నాడు. ఈ ఘటనలో రాము తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య యశోదతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ ప్రమాదంలో శేఖర్‌కు కూడా తీవ్రగాయాలు కావడంతో రాజాం ఆస్పత్రికి అక్కడి నుంచి శ్రీకాకుళం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి ధర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

పూరిల్లు దగ్ధం1
1/2

పూరిల్లు దగ్ధం

పూరిల్లు దగ్ధం2
2/2

పూరిల్లు దగ్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement