తిరుగు ప్రయాణంలో భవానీ భక్తుడి మృతి
బ్రాయిలర్
లైవ్ డ్రెస్‌డ్ స్కిన్‌లెస్
శ్రీ128 శ్రీ226 శ్రీ236
చికెన్
● గుర్తు తెలియని వాహనం ఢీకొని ప్రమాదం
పాలకొండ రూరల్: ఆధ్యాత్మిక చింతనతో భవానీ మాల ధరించిన పట్టణంలోని 16వ వార్డు కుమ్మరివీధికి చెందిన ద్రాక్షవరపు రాంబాబు(36) కూరగాయల మార్కెట్‌లో కలాసీగా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దీక్ష ముగింపులో భాగంగా ఈ నెల 12న సహ దీక్షాధారులు 19 మందితో కలసి ప్రత్యేక వాహనంలో విజయవాడ పయనమయ్యారు. అమ్మవారి దర్శనం అనంతరం మాల విసర్జన పూర్తి చేసి 13వ తేదీన తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో రాత్రి 10 గంటల సమయంలో తమ వాహనం పుణ్యక్షేత్రం అన్నవరం సమీపంలో పత్తిపాడు ప్రాంతం వద్దకు చేరుకున్న క్రమంలో బహిర్భూమికి వెళ్లేందుకు వాహనం దిగివెళ్లిన రాంబాబు ఎంతసేపటికీ వాహనం దగ్గరకు చేరలేదు. తన వద్ద సెల్‌ఫోన్‌కుడా లేకపోవడంతో సహచరులు ఆచూకీ తెలుసుకోలేకపోయారు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో మరునాటి ఉదయం వరకూ వాహనం నిలిపిన ప్రదేశంలో ఎదురు చూసి 14వ తేదీ ఉదయం అన్నవరం పోలీస్ స్టేషన్‌లో సహ భవానీలు ఫిర్యాదు చేశారు. పాలకొండ వచ్చిన వారికి మంగళవారం రాంబాబు గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందిన నట్లు పోలీసుల నుంచి సమాచారం అందింది. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు, ఆ వార్డు కౌన్సిలర్ కడగల వెంకట రమణ అన్నవరం పయనమయ్యారు. దగ్గరుండి పోస్టుమార్టం పూర్తి చేయించి, రాంబాబు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. మృతునికి భార్య రాజేశ్వరి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అమ్మవారి దర్శనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా అంటూ బంధువులు కన్నీరుపెట్టారు.


