జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఆరికతోట విద్యార్థులు
రామభద్రపురం: ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో జరిగిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన మండలంలోని ఆరికతోట ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు బి.రత్నకిషోర్ తెలిపారు.అండర్ 17 విభాగంలో రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ క్రీడా పోటీల్లో జిల్లా బాలికల జట్టు ప్రథమ స్థానం సాధించింది. బాలుర జట్టు ద్వితీయ స్థానం సాధించిందన్నారు. అందులో ఆంఽధ్రప్రదేశ్ తరఫున జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే 16 మంది సభ్యులలో తమ పాఠశాలకు చెందిన రేజేటి శ్రావణి, బాలుర జట్టు తరఫున ఎం.రంజిత్ కుమార్‌లు ఎంపికై నట్లు తెలిపారు. జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై న విద్యార్థులను పాఠశాల హెచ్‌ఎం జి కృష్ణవేణి, ఉపాధ్యాయులు మంగళవారం అభినందించారు.


