జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు గురుకుల కళాశాల విద్యార్థ
గుమ్మలక్ష్మీపురం: జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు గుమ్మలక్ష్మీపురం మండలంలోని భద్రగిరి గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాల(పీటీజీ)లో సెకెండ్ ఇయర్ బైపీసీ చదువుతున్న తోయక ప్రవల్లిక ఎంపికై నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డి.భారతి, ఫెన్సింగ్ కోచ్ పి.బాలరాజు సోమవారం విలేకరులకు తెలిపారు. ఈ మేరకు గుంటూరు జిల్లా వెనిగండ్లలోని శ్రీవేమన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా ఈనెల 13, 14వ తేదీల్లో జరిగిన 69వ స్టేట్ లెవెల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఛాంపియన్ షిప్ ఫెన్సింగ్ పోటీల్లో ఫోయిల్ వ్యక్తిగత విభాగంలో ప్రవల్లిక పాల్గొ ని ఉత్తమ ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించిందన్నారు. ఈ విద్యార్థిని త్వరలో ఇంఫాల్‌లో జరగనున్న జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలియజేస్తూ..జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థినికి అభినందనలు తెలియజేశారు.


