సీఎస్‌పీపై మహిళా సంఘాల ఫిర్యాదు
రేగిడి: మండలంలోని తునివాడ గ్రామానికి చెందిన స్వయం సహాయ సంఘాల మహిళలు సోమవారం రేగిడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో సంఘాలకు సంబంధించిన పొదుపు నగదును గ్రామానికి చెందిన సీఎస్‌పీ అల్లు శ్రీధర్ స్వాహా చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్యాంకులకు ప్రతి నెలా చెల్లించాల్సిన సొమ్మును అల్లు శ్రీధర్‌కు అందజేశామని, ఆ నగదు బ్యాంకు ఖాతాలకు జమ కాలేదని ఆవేదన చెందారు. పొదుపు, రుణ చెల్లింపులకు సంబంధించి రూ.43 లక్షలు స్వాహా చేశాడని, బాధ్యుడిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.


