కోటి గళాల గర్జన
విజయనగరం: ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజాగ్రహం పెల్లుబికింది. ప్రభుత్వ వైద్యాన్ని, వైద్య విద్యను ప్రైవేటీకరణకు పూనుకున్న చంద్రబాబు ప్రభుత్వ తీరుపై జనం నిరసన తెలిపారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి సేకరించిన 4లక్షల 50వేల సంతకాల ప్రతులతో విజయనగరం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణతో పాటు 7 నియోజకవర్గాలకు చెందిన సమన్వయకర్తలు, మహిళలు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. విజయనగరంలోని సీఎంఆర్ కూడలి నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎస్‌బిఐ మెయిన్ బ్రాంచి, డాబాగార్డెన్స్, కన్యకాపరమేశ్వరి ఆలయం, గంటస్తంభం కూడలి మీదుగా కార్పొరేషన్‌కార్యాలయం వద్ద ఉన్న దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహం వరకు సాగింది. అక్కడ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేర్చే కోటి సంతకాల ప్రతుల వాహనానికి శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పార్టీ నాయకులతో కలిసి జెండా ఊపారు. ముందుంగా మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు శంబంగి వెంకటచిన అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, డాక్టర్ తలే రాజేష్, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ జిల్లా పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శులు నెక్కల నాయుడుబాబు, కె.వి.సూర్యనారాయణరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, సంగంరెడ్డి బంగారునాయుడు, గొర్లె రవికుమార్, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ శెట్టివీర వెంకటరాజేష్, పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్, వార్డు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పార్టీ నాయకులు, కార్యకకర్తలు, వైఎస్సార్‌సీపీ అభిమానులు పాల్గొన్నారు.
విద్య, వైద్యం ప్రభుత్వమే అందించాలి
ప్రజలకు ప్రధాన అవసరాలైన విద్య, వైద్యం ప్రభుత్వమే అందించాలన్నది ప్రజలందరి డిమాండ్. ఇందులో భాగంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్యాయం. అది తెలియజెప్పేందుకే బాధ్యతగల ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ప్రజాఉద్యమ ర్యాలీలు నిర్వహించాం. ప్రజలను మోసం చేయాలనుకుంటే తగిన శాస్తి తప్పదు. – కోలగట్ల వీరభద్రస్వామి, ఏపీ శాసనసభ
మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్‌సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు, విజయనగరం
ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మెడలు వంచైనా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 19 నెలల కాలంలోనే పెద్ద ఎత్తున ప్రజ్యావతిరేకతను మూటగట్టుకుంది. అన్ని చేస్తామంటూ చంద్రబాబు చెప్పిన మాయమాటలు విని ఓట్లేసిన ప్రజలు మోసపోయారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టే పరిస్థితి రావడం దురదృష్టకరం. ఏరికోరి ఓట్లేసినవారే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లో సేకరించిన 4లక్షల 50వేల సంతకాల ప్రతులను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించాం.
– బొత్స సత్యనారాయణ,
శాసనమండలి విపక్షనేత.
జిల్లా కేంద్రం నుంచి కోటి సంతకాల ప్రతుల తరలింపు
విజయనగరంలో భారీ ర్యాలీ
తరలివచ్చిన ఏడు నియోజకవర్గాల
వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు
కోటి గళాల గర్జన
కోటి గళాల గర్జన
కోటి గళాల గర్జన


