సంతకంతో నిరసన
వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించే చంద్రబాబు ప్రభుత్వ పన్నాగాన్ని ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల రూపంలో వారి నిరసన, ఆవేదనను తెలియజేశారు. పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యం, వైద్య విద్యను దూరంచేస్తే వారి ఉసురు తగలక మానదు.
– శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యే, బొబ్బిలి
ఇదొక ప్రజా విన్నపం
కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అనేది వైఎస్సార్ సీపీకి సంబంధించిన కార్య క్రమం కాదు. కోట్లాది మంది ప్రజలు కోరుకుంటున్న విన్నపం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయవద్దని సంతకంతో అందజేసిన వినతి. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరిస్తే మంచిదే. లేకుంటే వినాశనం తప్పదు.
– డాక్టర్ తలే రాజేష్, వైఎస్సార్ సీపీ రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి
ఇదొక చారిత్రక ఉద్యమం
కోటిసంతకాల సేకరణ భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక చారిత్రక ఉద్యమం. ఇది బడుగు, బలహీన వర్గాలకు చెందిన భావితరాల వారికోసం ప్రతిపక్ష నేత బాధ్యత తీసుకున్న ఉద్యమం. భవిష్యత్‌లో నాడు జగన్ చేసిన ఉద్యమం ఫలితంగా వైద్యవిద్య అభ్యసించామని చెప్పుకునే రోజు వస్తుంది. పేద వర్గాలకు అందాల్సిన ఉచిత విద్య, వైద్యం కోసం కోట్లాది మంది అభిప్రాయాలను తెలియజేసే ఉద్యమం ఇది. ప్రభుత్వం కళ్లు తెరిపించి, బాధ్యతను గుర్తుచేసిన ప్రజా ఉద్యమం.
– కడుబండి శ్రీనివాసరావు,
ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే
రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ ఓ ఉద్యమంగా సాగింది. కోటి సంతకాల కార్యక్రమానికి పార్టీలకతీతంగా ప్రజలు మద్దతుగా నిలిచి, సంతకాలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత తెలిపారు. వైద్యాన్ని ప్రైవేటుపరం చేయొద్దని స్పష్టంచేశారు.
– బడ్డుకొండ అప్పలనాయుడు,
నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే
చంద్రబాబుకు పేదలంటే చులకన
సీఎం చంద్రబాబుకు పేదలంటే చులకన. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసి, పేదలకు వైద్యం, విద్యార్థులకు వైద్యవిద్య అందకుండా చేయాలని చూస్తే ప్రజల ఊరుకోరని ఈ రోజు స్పష్టమైంది.
– బొత్స అప్పల నరసయ్య, మాజీ ఎమ్మెల్యే, గజపతినగరం
సంతకంతో నిరసన
సంతకంతో నిరసన
సంతకంతో నిరసన


