సబ్‌జైలు సందర్శన
శృంగవరపుకోట: ఎస్.కోట సబ్‌జైలును జిల్లా న్యాయమూర్తి ఎం.బబిత సోమవారం సందర్శించారు. న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి ఖైదీలకు అందుతున్న చట్టపరమైన సౌక ర్యాలు, సేవలపై ఆరా తీశారు. నేర ప్రవృత్తిని వీడి కొత్త జీవితం ప్రారంభించాలని ఖైదీలకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, జైలు సూపరింటెండెంట్ పాల్గొన్నారు.
21న పల్స్‌పోలియో కార్యక్రమం
విజయనగరం ఫోర్ట్: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21న నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి కోరారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో నివారణకు చుక్కల మందును వేయించాలన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన వైద్య, ఐసీడీఎస్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 1,99, 386 మంది పిల్లలకు 1171 పోలియో బూతుల్లో పల్స్‌పోలియో నివారణకు చుక్కలమందు వేయాలన్నారు. ఈ నెల 21న పోలియో నివారణ మందు వేయించుకోలేని పిల్లలకు ఈ నెల 22, 23, 24 తేదీల్లో ఇంటింటి సర్వే నిర్వహించి శతశాతం పోలియో చుక్కలు వేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో మురళి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, ఐసీడీఎస్ పీడీ విమలరాణి, తదితరులు పాల్గొన్నారు.
వీరఘట్టం/ పాలకొండ: ఎలాంటి పనినైనా తనకు అనుకూలంగా మార్చుకుని ప్రచార ఆర్భాటం చేయడం, అబద్ధాలను నిజమని నమ్మించడం.. హామీలిచ్చి మోసం చేయడంలో సీఎం చంద్రబాబునాయుడుని మించిన వారు ఉండరన్నది రాజకీయ విశ్లేషకులు తరచూ చెప్పేమాట. పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసేందుకు చంద్రబాబు చేస్తున్న హడావుడి దీనికి అద్దం పడుతోంది. విమర్శలకు తావిస్తోంది. కానిస్టేబుల్ పోస్టులకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 30–11– 2022న నోటిఫికేషన్ ఇచ్చింది. 22–01–2023న రాతపరీక్ష కూడా నిర్వహించింది. అనంతరం కోర్టు కేసులతో పోస్టుల భర్తీ వాయిదా పడింది. 2024లో ప్రభుత్వం మారింది. కోర్టు కేసుల పరిష్కారంతో అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. వాస్తవంగా నియామక పత్రాలు ఎస్పీ చేతుల మీదుగా అందజేయాలి. మంగళగిరిలో అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు.
సబ్‌జైలు సందర్శన
సబ్‌జైలు సందర్శన


