ధాన్యం రైతు గగ్గోలు
● కొనుగోలు చేయని సంపత్‌స్వర్ణ రకం
● పొలాల్లోనే ధాన్యం
బాడంగి:
ఖరీఫ్‌లో సంపత్ స్వర్ణరకం పండించిన రైతులకు గడ్డుపరిస్థితి ఎదురైంది. ధాన్యం మరపట్టిస్తే బియ్యం ముక్కలవుతున్నాయంటూ కొనుగోలుకు మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు. మిల్లులకు తరలించినా వెనుకకు పంపిస్తున్నారు. దీంతో నూర్పిడి చేసిన ధాన్యం పొలాలు, కళ్లాల్లోనే ఉండిపోతున్నాయి. వాటిని కాపాలా కాసేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన విత్తనాలనే సాగుచేశామని, ఇప్పుడు కొనుగోలు చేయకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కొందరు మిల్లర్లు క్వింటాకు అదనంగా 10 కేజీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని వాపోతున్నారు.
ధాన్యం రైతు గగ్గోలు


