మంత్రి నోట మరో అబద్ధం
2020–21లో
నిర్మించాం
సాలూరు రూరల్: చేయనది చేసినట్టు చెప్పడం.. ఇచ్చిన హామీలు విస్మరించడం.. అబద్ధాలను నిజమని నమ్మించడం.. ఉత్తుత్తి హామీలతో ఓటర్లను మభ్యపెట్టడం సీఎం చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతల కు వెన్నతోపెట్టిన విద్య అన్నది జనంమాట. ఇటీవల ఏ ఒక్క పేద కుటుంబానికి సెంటు స్థలం కూడా ఇవ్వకుండా లక్షల్లో ఇళ్లునిర్మించామంటూ చంద్రబాబు ఆర్భాటం చేశారు. పేదలతో గృహప్రవేశాలు జరుపుతూ అంతా తామే చేసినట్టు డబ్బాకొట్టుకున్నారు. ఈ అంశం రాష్ట్రంలోనే చర్చకుతావుతీసింది. ఇప్పుడు 2020–21లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో నిర్మించిన రోడ్డును తామే నిర్మించామని, మన్యం అందాలను తిలకించేందుకు పర్యాటకులకు అవకాశం కలిగిందంటూ గిరిజన, సీ్త్ర శిశుసంక్షేమ శాఖమంత్రి మీడియా సాక్షిగా అబద్ధం చెప్పడంపై గిరిజనులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంత సులభంగా అబద్ధాలు చెప్పడంపై ఆశ్చర్యపోతున్నారు. ఎవరైనా చేసినది చెబుతారే తప్ప చేయనిది ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు. శిఖపరువు జలపాతం వద్ద పర్యాటకులను ఆకట్టుకునేందుకు గిరిజనులు ఏర్పాటు చేసిన వెదురుబొంగుల నిర్మాణాలను మంత్రి సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జలపాతాల వద్ద ఉన్న ఆహ్లాదకర వాతావరణం ఇన్నిరోజులు మిస్సయ్యామన్నారు. ఈ వాటర్‌ఫాల్‌కి ఇప్పుడు మనం ఇంత చక్కగా వస్తున్నామంటే ఈ రోడ్డు కూటమి ప్రభుత్వం వేసిందేనన్నారు. అసలు ఈ జలపాతానికి ఇంతమంది వస్తున్నారంటే ఈ రోడ్డు వేయబట్టేనని చెప్పారు.
శిఖపరువు రోడ్డు 2020–21లో నిర్మాణం...
దిగువ మెండంగి నుంచి శిఖపరువు గ్రామం వరకు రోడ్డును 2020–21 సంవత్సంలో సుమారు రూ. 2.3 కోట్ల ఖర్చుతో గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభు త్వం నిర్మించింది. చంద్రబాబు ప్రభుత్వం 2024లో ఏర్పాటైతే 2021లో పూర్తయిన రోడ్డును ఎలా నిర్మించారో మంత్రికే తెలియాలి. రోడ్డును కూటమి ప్రభుత్వమే వేసిందంటూ మంత్రి మీడియా సాక్షిగా అబద్ధాలు చెప్పడంపై అక్కడ ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలే అవాక్కయ్యారు. తోణాం పీహెచ్‌సీ భవనాన్ని గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమే నిర్మించింది. పీహెచ్‌సీకి అవసరమైన విద్యుత్ లైన్‌కోసం రూ.లక్ష మంజూరు చేయించిన మంత్రి... భవనాన్ని సైతం చంద్రబాబునాయుడు హయాంలోనే కట్టించామంటూ గతంలో అబద్ధం చెప్పారు. వివిధ అభివృద్ధి పనుల అంశంలో మంత్రి తరచూ అబద్ధాలు చెబుతుండడం జిల్లా ప్రజానీకంలో చర్చనీయాంశంగా మారింది.
దిగువ మెండంగి నుంచి శిఖపరువు రోడ్డును 2020–21లో రూ.2.30 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాం. రోడ్డు పనులకు అప్పట్లో ఏఈగా పనిచేశాను. – శంకరరావు, పీఆర్ ప్రాజెక్ట్స్ ఏఈ
శిఖపరువు రోడ్డు తామే వేశామంటూ మీడియా సాక్షిగా ప్రకటన
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినది 2024లో..
రోడ్డు వేసినది 2020–21లో..
మంత్రి సంధ్యారాణి అబద్ధాలపై
విస్తుపోయిన గిరిజనం
మంత్రి నోట మరో అబద్ధం


