జాతీయ అథ్లెటిక్స్‌ పోటీలకు టెక్నికల్‌ అఫీషియల్‌గా ఆనంద్‌కిషోర్‌ | - | Sakshi
Sakshi News home page

జాతీయ అథ్లెటిక్స్‌ పోటీలకు టెక్నికల్‌ అఫీషియల్‌గా ఆనంద్‌కిషోర్‌

Nov 18 2025 5:53 AM | Updated on Nov 18 2025 5:53 AM

జాతీయ అథ్లెటిక్స్‌ పోటీలకు టెక్నికల్‌ అఫీషియల్‌గా ఆనంద్

జాతీయ అథ్లెటిక్స్‌ పోటీలకు టెక్నికల్‌ అఫీషియల్‌గా ఆనంద్

విజయనగరం: జాతీయస్థాయిలో జరగనున్న ఖేలో ఇండియా యూనివర్సీటీ అథ్లెటిక్స్‌ పోటీలకు టెక్నికల్‌ అఫీషియల్‌గా జిల్లాకు చెందిన నెల్లిమర్ల జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు వి.ఆనంద్‌కిషోర్‌ నియామకమయ్యారు. ఈ మేరకు అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా జాయింట్‌ కార్యదర్శి ఎ.రాఘవేంద్రరావు నుంచి సోమవారం నియామక ఉత్తర్వలు జారీ అయ్యాయి. ఆనంద్‌కిషోర్‌ డిసెంబర్‌ 1 నుంచి 4వ తేదీ వరకు రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైపూర్‌లో జరగనున్న అథ్లెటిక్స్‌ పోటీల్లో ఈ సేవలందించనున్నారు. జాతీయ అథ్లెటిక్స్‌ పోటీలకు టెక్నికల్‌ ఆఫీషియల్‌గా నియామకమైన ఆనంద్‌కిషోర్‌ను జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పి.లీలాకృష్ణ, జి.శ్రీకాంత్‌, వ్యాయామ ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement