స్పందించిన యంత్రాంగం
చీపురుపల్లి: పట్టణంలోని బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల/కళాశాల వెనుక గేటుకు అడ్డంగా గోడ నిర్మించేవారిపై చర్యలు తీసుకునేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. పాఠశాల వెనుక గేటుకు అడ్డంగా గోడ నిర్మించిన వైనంపై ‘అంతా నా ఇష్టం’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచరితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. వారి ఆదేశాల మేరకు తహసీల్దార్ డి.ధర్మరాజు గురుకుల పాఠశాల వెనుక గేటుకు అడ్డంగా నిర్మించిన గోడను పరిశీలించారు. ఆ సమయానికి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ గద్దే బాబూరావు కూడా అక్కడకు చేరుకున్నారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ గురుకుల కళాశాల/పాఠశాలకు వాహన రాకపోకలకు ఇబ్బందులు లేకుండా గేటు ఏర్పాటుకు గద్దే బాబూరావు అంగీకరించారని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని జిల్లా యంత్రాంగానికి నివేదిస్తానని చెప్పారు.
స్పందించిన యంత్రాంగం


