ప్రతి అర్జీకి ప్రాధాన్యం ఇవ్వాలి
● సత్వర పరిష్కారమే లక్ష్యంగా
పనిచేయాలి
● కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి
నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి, వారితో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానంగా వచ్చిన ఫిర్యాదుల్లో కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రులు వేధింపులు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ–ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్‌లైన్ మోసం, ప్రేమ పేరుతో మోసం, ఇతర సమస్యలపై ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించగా వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా మాట్లాడి వచ్చిన ఫిర్యాదులు వాస్తవాలు అయినట్‌లైతే చట్టపరిధిలో చర్యలు చేపట్టి తీసుకున్న చర్యల నివేదికను తన కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. మొత్తంగా 14 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు ఎస్పీ మాధవ్ రెడ్డి కార్యక్రమంలో డీసీఆర్‌బీ సీఐ ఆదాం, ఎస్సై రమేష్‌నాయుడు తదితరులు పాల్లొన్నారు.
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 31 వినతులు
సీతంపేట: ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు 31 విన తులు వచ్చాయి. ఏపీవో ఎస్వీ గణేష్ అర్జీలను స్వీకరించారు. మల్లికాలనీకి చెందిన సవర సుందరరావు వరి నూర్పిడి యంత్రం ఇప్పించాలని కోరాడు. డీకేటీ పట్టా ఇప్పించాలని తాడిపాయికి చెందిన గిరిజనులు కోరారు. బొడ్డపాడుకు చెందిన సురేష్ మోంఽథా తుఫాన్ పరిహారం ఇప్పించాలని విన్నవించాడు. పెదరామ బ్రిడ్జి శిథిలావస్థ
లో ఉన్నందున కొత్తబ్రిడ్జికి నిధులు మంజూరు చేసి నిర్మించాలని సర్పంచ్‌లు తిరుపతిరావు, సుశీల తదితరులు కోరారు. జన్నోడుగూడకు చెందిన గిరిజనులు కమ్యూనిటీ హాల్ నిర్మించాలని విన్నవించారు. కార్యక్రమంలో డిప్యూటీఈవో రామ్మోహన్‌రావు, ఏపీడీ శ్రీహరి, డీఈ నాగభూషణరావు, ఏడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్: పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన ప్రతి దరఖాస్తుకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో జిల్లా రెవెన్యూ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌లతో కలసి జిల్లా నలుమూలల నుంచి పలు సమస్యలను విన్నవించుకునేందుకు వచ్చిన అర్జీదారుల నుంచి కలెక్టర్ వినతులను స్వీకరించారు. అలాగే ప్రత్యేకంగా రెవెన్యూ సమస్యల నిమిత్తం ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌లో అర్జీలను జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి పార్వతీపురం, పాలకొండ సబ్‌కలెక్టర్లు ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్‌లు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ఫిర్యాదు దారుల నుంచి వచ్చే ప్రతి అర్జీని నిర్దిష్ట గడువులోగా బాధ్యతగా పరిష్కరించాలని సూచించారు. పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన పలు దరఖాస్తుల్లో పార్వతీపురం పట్టణానికి చెందిన చింతాడ అనంతరావుకు పింఛన్ మంజూరు చేయాలని, అలాగే కురుపాం మండలం ఆవిరి గ్రామానికి చెందిన ఎ. రాజారావు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎస్‌కోట మండలం కొండపల్లి పూడి గ్రామానికి చెందిన బి. సునీతకు ప్రభుత్వం నుంచి లోను మంజూరు చేయాలని, అలాగే జియ్యమ్మవలస మండలం కొత్తవలసలో కమ్యూనిటీ హెల్త్‌వర్కర్ పోస్టు ఖాళీగా ఉన్న క్రమంలో అర్హత మేరకు తనకు అవకాశం కల్పించాలని కె.సౌందర్య కోరారు.
రెవెన్యూ పరమైన అర్జీలలో..
గరుగుబిల్లి మండలం వల్లరగుడబ గ్రామానికి చెందిన జి. కృష్ణమూర్తినాయుడు రెవెన్యూ రికార్డుల్లో తమ భూమిలో వేరేవారి పేరు నమోదైనందున తప్పులను సరిచేయాలని విన్నవించారు. అలాగే గత ఆరు సంవత్సరాలుగా జీవనోపాధి నిమిత్తం సాగు చేస్తున్న భూమికి కొండపోడు పట్టా మంజూరు చేయాలని మక్కువ మండలం శంబరకు చెందిన ఎ. సంతోష్ విన్నవించగా అదే మండలంలోని సివిడి గ్రామానికి చెందిన ఎం.తవిటన్నదొర తన 12 సెంట్ల భూమికి పొజిషన్ సర్టిఫికెట్ మంజూరు చేయాలని, కోరాడు. అలాగే పార్వతీపురం మండలం కొత్తవలస గ్రామ రెవెన్యూలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని డి. అప్పారావు కోరారు. అలాగే దివ్యాంగులు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో వారికి అక్కడకక్కడే వినికిడి యంత్రాలను అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
చట్టపరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలి
పార్వతీపురం రూరల్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌కు అర్జీదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను చట్టపరిధిలో అవకాశం ఉన్న మేరకు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లాలో ఉన్న పలు స్టేషన్ల పరిధిల
ప్రతి అర్జీకి ప్రాధాన్యం ఇవ్వాలి
ప్రతి అర్జీకి ప్రాధాన్యం ఇవ్వాలి
ప్రతి అర్జీకి ప్రాధాన్యం ఇవ్వాలి


