పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెరగాలి
● డీఎంహెచ్‌ఓ జీవనరాణి
డెంకాడ: ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జీవనరాణి వైద్యాధికారులు, సిబ్బందిని ఆదేశించారు. డెంకాడ పీహెచ్‌సీని ఆమె బుధవారం సందర్శించారు. ఆస్పత్రి రికార్డులు పరిశీలించారు. ఓపీ, ప్రసవాల వివరాలపై ఆరా తీశారు. మాతా, శిశు సంరక్షణ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం చేయరాదన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేటర్ అనిల్‌కుమార్, పీహెచ్‌సీ సీనియర్ అసిస్టెంట్ దుర్గారావు, ఫార్మాసిస్ట్ అప్పలనాయుడు, స్టాఫ్‌నర్సు మీనాకుమారి, ల్యాబ్‌టెక్నీషియన్ గోవింద, తదితరులు పాల్గొన్నారు.


