రూ.55 కోట్లతో 109 చెరువుల అభివృద్ధి
విజయనగరం అర్బన్:
నీటిపారుదల శాఖ విజయనగరం డివిజన్ పరిధిలో 109 చెరువులను రూ.55 కోట్లతో అభివృద్ధి చేస్తామని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి తెలిపారు. చిన్నతరహా నీటిపారుదల చెరువుల అభివృద్ధిపై తన చాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్‌ఆర్‌ఆర్ (రిపేర్స్, రెస్టోరేషన్, రెన్నోవేషన్) కింద మొదటి విడత 44, రెండో విడత 49, తాజాగా మూడో విడతలో 16 చెరువుల అభివృద్ధికి ప్రతిపాదనలు చేశామన్నారు. మొత్తం ఐదు నియోజకవర్గాల్లోని 19 మండలాల్లోని చెరువులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో ఇరిగేషన్ ఎస్‌ఈ పి.అప్పలనాయుడు, ఈఈ వెంకటరమణ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కవిత, డ్వామా పీడీ శారదాదేవి, ఇతర ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
● కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి


