ఎన్నాళ్లీ నిరీక్షణ..!
ఆదేశాలు వస్తే అందజేస్తాం..
ప్రస్తుతం జిల్లాలో 1.30 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నాం. వీరికి ప్రతి నెలా సుమారు రూ.60 కోట్లు పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలు రాగానే కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి వారికి పింఛన్లు అందజేస్తాం. భర్త చనిపోయిన వెంటనే ఆ స్థానంలో భార్యకు పింఛన్ అందిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే తప్ప కొత్త పింఛన్లు మంజూరు చేసే వీలుండదు.
– ఎం. సుధారాణి, డీఆర్‌డీఏ పీడీ,
పార్వతీపురం మన్యం జిల్లా
వీరఘట్టం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు పూర్తవుతున్నా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు ఇలా అర్హులైన లబ్ధిదారులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నిత్యం సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ ఇంకా సైట్ ఓపెన్ కావడం లేదని అధికారులు చెబుతుండడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. గ్రామాల్లో అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రతి నెలా పింఛన్లే ప్రధాన ఆధారం. గత ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్ సొమ్మును ఠంఛన్‌గా అందజేసేది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త పింఛన్ల మాట దేవుడెరుగు ఉన్న పింఛన్లోనే కోతలు విధిస్తుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో...
గతంలో వైఎస్సార్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే లబ్ధిదారులను ఎంపిక చేసి కొత్తగా అర్హులైన వారికి పింఛన్లు అందజేసేవారు. మొదటి మూడేళ్ల పాటు ప్రతి మూడు నెలలకోసారి చొప్పున నూతన పింఛన్లు మంజూరు చేసేవారు. తర్వాత 2023, 2024 సంవత్సరాల్లో ప్రతి ఆరు నెలలకు అర్హులైన వారు నష్టపోకుండా వలంటీర్ల ద్వారా ఎంపిక చేసి పింఛన్లు అందజేశారు. 2024 జనవరిలో చివరిగా నూతన పింఛన్లు మంజూరు చేశారు. తరువాత ఎన్నికల కోడ్ రావడంతో నూతన పింఛన్లకు బ్రేక్ పడింది. ఆ తర్వాత 2024 ఏప్రిల్‌లో ఆగిపోయిన సైట్ నేటికి ఓపెన్ కావడం లేదు.
కొత్త పింఛన్ల కోసం 20 వేల మంది
ఎదురుచూపులు
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది నవంబర్‌లో కొత్త జీవో తీసుకొచ్చింది. పింఛన్ అందుకుంటున్న భర్త చనిపోతే మరుసటి నెల నుంచి భార్యకు పింఛన్ అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏడాదిగా నూతన పింఛన్లు రాకపోవడంతో జిల్లాలో 60 ఏళ్లు నిండిన సుమారు 20 వేల మంది లబ్ధిదారులు పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. 2024 డిసెంబరులో దరఖాస్తులు స్వీకరించి సంక్రాంతికి జన్మభూమి కార్యక్రమం నిర్వహించి నూతన పింఛన్లు అందజేస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రకటనలు చేశారు. దీంతో సంక్రాంతికి కొత్త పింఛన్లు కోసం ఎదురుచూసిన లబ్ధిదారులకు ఎదురుచూపులే మిగిలాయి.
50 ఏళ్ల్లకే పింఛన్ హామీ అమలుకు
నోచుకునేదెప్పుడో ?
ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామని సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే అధికారంలోకి వచ్చి 17 నెలలు దాటినా ఆ హామీ ఊసెత్తడం లేదు. దీంతో జిల్లాలో 60 వేల మందికి పైగా 50 ఏళ్లు నిండిన వారు ప్రభుత్వ హామీ ఎప్పుడు అమలు చేస్తుందా.. అని ఎదరు చూస్తున్నారు.
17 నెలలుగా ఓపెన్
కాని సైట్
జిల్లాలో కొత్త పింఛన్ల కోసం 20 వేల మంది అర్హులు ఎదురు చూపులు


