రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు జిల్లా క్రీడాకారుల
విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న స్కూల్ గేమ్స్ బ్యాడ్మింటన్ పోటీలకు జిల్లా క్రీడాకారులు మంగళవారం పయనమయ్యారు. ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు తిరుపతిలో అండర్–17 విభాగంలో బాల, బాలికలకు నిర్వహించే పోటీల్లో జిల్లా నుంచి 10మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించనున్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్తున్న జిల్లా క్రీడాకారులకు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీలు పొట్నూరు శ్రీరాములనాయుడు, కోచ్ కె.తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.


